రాజన్న ఆలయ అధికారులతో కలెక్టర్ సమావేశం
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయాధికారులతో జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఆలయ EO రమాదేవి, EE రాజేష్, DE రఘునందన్లతో కలిసి ఆమె ఆలయ పనుల తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఒకే మార్గం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్న క్రమంలో తలెత్తుతున్న ఇబ్బందులపై చర్చించినట్లు తెలిపారు.