' అక్రమ విక్రయాలు జరిపితే చర్యలు తప్పవు'
KDP: ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి పొందిన వారు మాత్రమే దీపావళికి బాణాసంచా విక్రయాలు జరుపుకోవచ్చని సీఐ వంశీధర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతులు పొందకుండా అనధికారికంగా విక్రయాలు జరిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు పొందిన వారు తగిన జాగ్రత్త చర్యలు తప్పక పాటించాల్సి ఉంటుందన్నారు.