నేడు ఈ ప్రాంతాలకు పవర్ కట్
GNTR: పొన్నూరులో శుక్రవారం విద్యుత్ మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ కారణంగా అంబేద్కర్ కాలనీ 11 కెవి ఫీడర్ పరిధిలోని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. అంబేద్కర్ కాలనీ, ఇందిరా కాలనీ, ముబారక్ నగర్, పాత పొన్నూరు ప్రాంతాలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదని టౌన్ ఏఈ ఆర్. శంకర్రావు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.