VIDEO: మురికివాడల హక్కులకై విశాఖలో భారీ ర్యాలీ
VSP: మురికివాడ నివాసితుల హక్కుల సాధన కోసం మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో విశాఖలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. దొండపర్తి డీఆర్‌ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో వందలాదిమంది పాల్గొన్నారు. మురికివాడ ప్రజలకు నివాస హక్కులు కల్పించాలని కోరుతూ జీవీఎంసీ అదనపు కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.