VIDEO: బాలల సంరక్షణ శాఖ అధికారులకు చెంతకు శిశువు
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వల్లగొండ శివారు పత్తి చేనులో శనివారం గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లిన ఓ శిశువును సీఐ కుమారస్వామి, ఎస్సై కళ్యాణ్ కాపాడారు. శిశువును బాలల సంరక్షణ శాఖ (CWC) అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కుమారస్వామి పేర్కొన్నారు.