రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
WGL: దుగ్గొండి (M)లోని మహ్మదాపురం గ్రామానికి చెందిన రెడ్డి రమేష్ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హనుమాన్ మాల ధరించేందుకు గీసుకొండ మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళుతుండగా, మచ్చాపూర్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న బైక్ పార్క్ చేసిన కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందినట్లు తెలిపారు.