'గ్రామపంచాయతీలలోనే సంపద సృష్టించాలి'
PPM: గ్రామపంచాయతీలు బలోపేతం చెందడానికి పంచాయతీలు పరిధిలో ఉన్న వనరులను గుర్తించి వాటి ద్వారా సంపదను సృష్టించవచ్చని ఈవోపీఆర్డీ మల్లేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన పాచిపెంట మండల పరిషత్తు అభివృద్ధి కార్యాలయం సమావేశం భవనంలో అభివృద్ధిపై సర్పంచులు, కార్యదర్శులకు డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు బుధవారం శిక్షణ తరగతి నిర్వహించారు.