VIDEO: బైక్‌లో బుసలు కొట్టిన పాము
MDK: కౌడిపల్లి మండలం కూకుట్లపల్లిలో జంగ ప్రశాంత్ అనే వ్యక్తి పల్సర్ బైక్‌లో నాగుపాము దూరింది. బైక్ తీస్తున్న సమయంలో పాము బుసలు కొట్టడంతో ఆయన భయాందోళనకు గురయ్యాడు. బైక్‌పై వేడి నీళ్లు చల్లడంతో పాము బయటకు వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.