VIDEO: కళాకారులతో కలిసి డప్పు కొట్టిన మంత్రి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు వార్డుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం రోజు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కళాకారులతో కలిసి డప్పును వాయించి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.