పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

SRCL: పనుల జాతర 2025 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో పనుల జాతర 2025లో భాగంగా నూతన (క్యాటల్ షెడ్) పశువుల పాక నిర్మాణానికి శుక్రవారం జిల్లా కలెక్టర్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.