రేపటి నుంచి ఒంటిపూట బడులు
తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7:45AM నుంచి 12:30PM వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. తెలంగాణలో 8AM నుంచి 12:30PM వరకు తరగతులు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో స్కూల్ ముగిశాక మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపించనున్నారు.