ఆలయ పునరుద్ధరణకు చర్యలు
MLG: జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయ సముదాయంలో ఉన్న కామేశ్వరాలయం పునరుద్ధరణకు కేంద్ర పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన ఈ ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావడానికి రూ. 6.86 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. పునర్నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ చివరికి చేరుకుంది. ఆలయంలోని శిల్పాలు, నిర్మాణ భాగాలను సంరక్షించనున్నట్లు తెలిపారు.