స్కూల్‌కు వెళ్ళాలి అంటే పడవ తప్పనిసరి

స్కూల్‌కు వెళ్ళాలి అంటే పడవ తప్పనిసరి

ASR: అనంతగిరి మండలం గుమ్మ పంచాయతీలో కడరేవు, కళ్యాణ గుమ్మి, మదనగరువు, పినకోట పంచాయతీ సొలు బొంగు గ్రామంలో12 మంది విద్యార్థులు రైవాడ జలాశయం మీదుగా అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి, తామరబ్బ ఎంపీపీ స్కూల్లో చదువుకునేందుకు వెళ్తున్నారు. భారీ వర్షాలు వస్తే ఇంటి వద్ద ఉంటున్నారు తప్ప చదువుకు వెళ్ళడానికి వీలులేదు. జలాశయంలో నీరు ఎక్కువగా ఉంటే కొండ చుట్టూ 4కిలోమీటర్లు తప్పనిసరి.