ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్పంచ్ శివశంకర్ రెడ్డి సన్మానం
WGL: వర్ధన్నపేట నియోజకవర్గం, అయినవోలు మండలంలోని నరసింహుల గూడెం గ్రామ సర్పంచిగా ఎన్నికైన పోలపల్లి శివశంకర్ రెడ్డిని సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.