'ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి'

SRD: పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు. జహీరాబాద్‌లో శనివారం డివిజన్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్ పాల్గొన్నారు.