సర్కారు వైద్యం.. భరోసాకు నిదర్శనం!
SRPT: ప్రభుత్వ వైద్యులే సామాన్యులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. నేరేడుచర్ల పీహెచ్‌సీలో ఆయుర్వేద డాక్టర్ శృతి ఆడబిడ్డకు జన్మనివ్వగా, కలెక్టర్ ఆమెను పరామర్శించి 'బేబీ కిట్' అందజేశారు. సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించడం ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు ఉన్నారు.