' రైతులకు సాంకేతిక సమస్యలు శాపంగా మారాయి'
W.G: సాంకేతిక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయని రైతు నాయకుడు కూనపరెడ్డి రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నరసాపురంలో ఆయన మాట్లాడుతూ.. ఈ- పాస్ పుస్తకాలు అందక రైతులు సచివాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదన్నారు. సైట్ ఓపెన్ కావడం లేదనే సాకుతో సిబ్బంది కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.