VIDEO: ల్యాబర్తిలో ఘనంగా పోచమ్మ బోనాల వేడుకలు

WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పోచమ్మకు నైవేద్యంగా బోనాలు చేసి తీసుకెళ్లి సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా బోనాల వేడుకలో శివసత్తుల కోలాహలం అందరిని మంత్రముగ్ధులను చేసింది. నెత్తిన బోనం పెట్టుకొని కదలకుండా శివసత్తులు వేసిన నృత్యాలు ఆసక్తిగా నిలిచాయి.