'ఎన్నికల నిర్వహణకు ప్రజలు, సిబ్బంది సహకరించాలి'
మెదక్ జిల్లాలో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రజలు, సిబ్బంది సహకరించాలని డీఎస్పీ ప్రసన్నకుమార్ కోరారు. శనివారం చిన్నశంకరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.