వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన ఎస్సై

KMM: ఎర్రుపాలెం మండల ఎస్సై రమేష్ కుమార్ శుక్రవారం ఓ వృద్ధురాలి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకెళ్తే.. బనిగండ్లపాడుకు చెందిన వెంకటాయమ్మ ఇంట్లో గొడవ కారణంగా మీనవోలు కట్టలేరు బ్రిడ్జిపై ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చింది. దీంతో అటుగా వెళ్తున్న ఎస్సై అనుమానస్పదంగా వృద్ధురాలు కనిపించడంతో ఆమెను విచారించి విషయం తెలుసుకొని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.