కారు బీభత్సం.. తప్పిన ప్రమాదం

కారు బీభత్సం.. తప్పిన ప్రమాదం

ప్రకాశం: త్రోవగుంట సర్వీసు రోడ్డు వద్ద ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న మోటార్ సైకిల్‌ను, పక్కనే ఉన్న ఇళ్ళు, షాపులను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొనకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.