మానేరు నదిపై హై లెవెల్ వంతెన.. తగ్గనున్న దూర భారం

మానేరు నదిపై హై లెవెల్ వంతెన.. తగ్గనున్న దూర భారం

BHPL: కాటారం మండలం దామెరకుంట-మంథని మండలం వెంకటాపూర్ గ్రామాల మధ్య మానేరు నదిపై హై లెవల్ వంతెన నిర్మాణం జరగనుంది. దీంతో అటవీ ప్రాంత గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. కాలేశ్వరం వెళ్లేందుకు మరో మార్గం సిద్ధమై సుమారు 25 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కాలేశ్వరం అభివృద్ధికి తోడ్పడుతూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారులతో అనుసంధానం ఏర్పడనుంది.