VIDEO: బాబోయ్.. ఎంత పెద్ద కొండచిలువో..!
MDCL: ఘట్‌కేసర్ పరిధిలోని చిన్న చెరువు సమీపంలో భారీ కొండచిలువ సంచారం స్థానికుల్లో భయాందోళనలకు దారితీసింది. నిత్యం ప్రజలు సంచరించే ప్రాంతంలో ఇంత పెద్ద కొండచిలువ కనిపించడంతో, అక్కడివారు ఆందోళన చెందారు. అటవీ శాఖ అధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ కొండచిలువను వెంటనే పట్టుకుని, దానిని సురక్షితంగా జూపార్కుకు తరలించాలని స్థానికులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు.