VIDEO: కొత్తపేటలో అకస్మాత్తుగా కుంగిన భూమి

VIDEO: కొత్తపేటలో అకస్మాత్తుగా కుంగిన భూమి

KDP: ఖాజీపేట మండలం కొత్తపేటలో సోమవారం రైతు జయన్న పొలంలో అకస్మాత్తుగా భూమి కుంగిపోయి పెద్ద రంధ్రం ఏర్పడింది. గుంత లోపల నీరు, విశాలమైన ఖాళీ స్థలం కనిపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే పరిశీలించి, భూమి కుంగడానికి గల కారణాలను గుర్తించాలని రైతు కోరుతున్నారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.