న్యాయశాఖ సంచలన నివేదిక
2018 నుంచి హైకోర్టుల్లో 849 మంది జడ్జిలు నియమితులయ్యారు. వీరిలో 33 మంది SC, 17 మంది STలు ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. జడ్జిల ఎంపికలో సామాజిక న్యాయం పాటిస్తూ SC, ST, BC, మైనార్టీ, మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం నియామకాలు కొలీజియం సిఫార్సుల మేరకే జరుగుతున్నాయని, సామాజిక వైవిధ్యం కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని కేంద్రం స్పష్టం చేసింది.