కంచికచర్లలో పెరిగిన చలి తీవ్రత

NTR: కంచికచర్లలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు, తెల్లవారుజామున ప్రయాణించే ఆర్టీసీ బస్సులు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8:00 గంటల వరకు వాతావరణం ఇలానే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే, చలి తీవ్రత ఎక్కువ ఉన్నందున పిల్లలు, వృద్దులు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.