మహా పడిపూజ.. తన్మయత్వంలో భక్తులు
RR: పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ బాచారం గ్రామంలో అయ్యప్పస్వామి 18వ మహా పడిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో BRS రాష్ట్ర నాయకులు దండెం రాంరెడ్డి పాల్గొన్నారు. హరిహర పుత్రుడి పూజకు అయ్యప్పస్వాములతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారిని కీర్తిస్తూ తన్మయత్వం పొందారు. అయ్యప్ప నామస్మరణతో ప్రాంగణం ఆధ్యాత్మికంగా మారు మ్రోగింది.