ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
CTR: కేంద్ర ప్రభుత్వం GST తగ్గించడంపై బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ రాజు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలను ఏర్పాటు చేసి పాలభిషేకం చేశారు. GST తగ్గించడంతో సామాన్యులకు ఎంతో మేలు జరిగిందన్నారు.