VIDEO: వరంగల్ జిల్లాలో జోరు వర్షం
WGL: సంగెం మండలంలోని పలు గ్రామాల్లో వర్షం పడుతోంది. ఉదయం నుంచి వాతావరణం ముసురుగా ఉండగా కొద్దిసేపటి క్రితం వర్షం ప్రారంభమైంది. అయితే ఈ వర్షాల పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాలు దెబ్బతింటాయని భయాందోళనకు గురవుతున్నారు. మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.