మద్యం కేసులో నిందితుల రిమాండ్ 13 వరకు పొడిగింపు
అన్నమయ్య: కల్తీ మద్యం కేసులో నిందితుల రిమాండ్‌ను ఈ నెల 13వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. గురువారంతో రిమాండ్ గడువు ముగియడంతో, ఎక్సైజ్ అధికారులు 11 మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. ఇందులో ఏ1 జనార్ధన్ రావు, ఏ2 జగన్ మోహన్ రావుతో పాటు మొత్తం 11 మందికి రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను కొనసాగించాలని కోర్టు సూచించింది.