పెట్రోల్ కొరత పుకార్లు.. ప్రజలు ఆగమాగం

పెట్రోల్ కొరత పుకార్లు.. ప్రజలు ఆగమాగం

TG: పెట్రోల్ కొరతపై పుకార్లతో వాహనదారులు ఆగమాగం అవుతున్నారు. ఈరోజే చివరి రోజు.. ఇక పెట్రోల్ దొరకదు అనే వార్తలను నమ్మి.. పెట్రోల్ బంకుల వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అవసరం లేకపోయినా.. ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నారు. దీంతో ఉద్యోగాలకు వెళ్లేవారికి, అత్యవసర సేవల కోసం బయటకు రావాల్సిన వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. అయితే పెట్రోల్ కొరత లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.