ఇళ్ల ప్రారంభోత్సవానికి సీఎం.. మహిళ సంతోషం

BDK: పైసా ఖర్చు లేకుండా మా లాంటి పేదోళ్లకు ప్రభుత్వం ఇల్లు కట్టిస్తోంది. సొంతిల్లు కట్టుకుంటుంటే నాకైతే మస్తు సంతోషంగా ఉంది. ఇళ్ల ప్రారంభోత్సవానికి సీఎం రావడం అదృష్టంగా భావిస్తున్నాను' అని బెండాలపాడుకి చెందిన లబ్ధిదారురాలు బచ్చల నర్సమ్మ తెలిపింది. కాగా ఈనెల 21న బెండాలపాడులో సీఎం ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు.