అనారోగ్యంతో బాధపడుతూ మహిళ ఆత్మహత్య
RR: మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన వనస్థలిపురం PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మన్సురాబాద్ శ్రీరామ హిల్స్ కాలనీకి చెందిన అన్నపూర్ణ అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గతేడాది భర్త అనారోగ్యంతో మృతి చెందగా, అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి సరిగ్గా లేక అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు.