'రైల్వే పనుల్లో అలసత్వం వద్దు'
SKLM: ఇచ్ఛాపురం నియోజకవర్గంలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇవాళ తన క్యాంప్ కార్యాలయంలో రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాలు పై సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.