రోడ్డు ప్రమాదంలో.. వ్యక్తి మృతి
ప్రకాశం: పామూరు మండలం ఇనుమెర్ల గ్రామ సమీపంలో గురువారం ఆటోను వేగంగా వస్తున్న కారు ఢీకొన్న ఘటన గురువారం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా, ఒక వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పామూరుకు చెందిన చంద్రశేఖర్‌గా స్థానికులు గుర్తించారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.