బాలికకు వేధింపులు.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

బాలికకు వేధింపులు.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

TG: హైదరాబాద్ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికకు వేధింపుల కేసులో నిందితుడు ఆకాశ్‌కు 25 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల ఫైన్ వేసింది. బాలికకు ఇన్‌స్టాలో పరిచయమైన ఆకాశ్.. డబ్బులు ఇవ్వాలంటూ ఆమె ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన కోర్టు పైవిధంగా తీర్పు వెలువరించింది.