సురవరం మృతి పట్ల ప్రముఖుల సంతాపం

AP: కమ్యూనిస్ట్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారని తెలిసి చింతించానని Dy.CM పవన్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. విద్యార్థి దశ నుంచి పోరాట పంథాలో నడిచిన ఆయన తదనంతర కాలంలో రైతులు, కార్మికులు పక్షాన బలంగా గళం వినిపించారని కొనియాడారు. మరోవైపు సురవరం మృతి పట్ల మాజీ సీఎం జగన్ కూడా సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్త పరిచారు.