'నర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవు'

'నర్సింగ్ సిబ్బందికి జీతాలు లేవు'

HYD: T.I.M.S నుంచి డిప్యూటేషన్లపై ఉస్మానియా, నిలోఫర్, కోఠి మెటర్నిటీ, సరోజినీ, E.N.Tకి వెళ్లిన నర్సింగ్ సిబ్బందికి 4 నెలలు గడుస్తున్నా జీతాలు లేవని వారు వాపోతున్నారు. తాము జీతాలు లేకుండా ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.