రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

రోడ్డు భద్రతపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు

సత్యసాయి: జిల్లాలో ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ప్రధాన రహదారులు, పట్టణాల్లో హెల్మెట్, మద్యం సేవించి డ్రైవింగ్, వేగం, మొబైల్ వినియోగంపై దృష్టి పెట్టారు. నిబంధనలు పాటించాలని వాహనదారులకు సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.