అధికారులు, సిబ్బందిని ప్రశంసించిన కార్పొరేటర్

అధికారులు, సిబ్బందిని ప్రశంసించిన కార్పొరేటర్

RR: మన్సురాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో వినాయక నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా ఈరోజు కొలను ప్రాంతాన్ని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో శ్రమించి నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయడంలో అంకితభావంతో పనిచేశారన్నారు. ఈ సందర్భంగా వారిని ప్రశంసించారు.