మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తునట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి గౌస్ బాషా తెలిపారు. జిల్లా పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 8 నుంచి 14 ఏళ్లలోపు వయసు గల క్రీడాకారులకు కోచింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు వినియోగించుకోవాలని కోరారు.