ధనకొండ గంగమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పూజలు
CTR: చిత్తూరు రూరల్ మండలం తుమ్మింద పాలెం గ్రామంలో జరుగుతున్న శ్రీ ధనకొండ గంగమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక కూటమి నాయకులు, ఉత్సవ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.