ఇళ్ల నిర్మాణ పనుల సమస్యల పరిష్కారానికి కృషి

ఇళ్ల నిర్మాణ పనుల సమస్యల పరిష్కారానికి కృషి

ADB: గిరిజనుల ఇళ్ల నిర్మాణ సమస్యను పరిష్కరిస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అన్నారు. తాంసి మండలంలోని లీంగూడ ఆదివాసి కోలాం గిరిజనులకు 7 ఇండ్లకు కలెక్టర్ అనుమతి రాకపోవడంతో సోమవారం లబ్దిదారులు బోథ్ MLAకు సమస్యను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే మీ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ భీంరావ్‌తో తదితర నాయకులు ఉన్నారు.