లక్ష్మీపూర్ సర్పంచ్‌గా సోర్తే గజానన్
ADB: ఆదివారం జరిగిన రెండో విడత ఎన్నికల్లో జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సోర్తే గజానన్ సర్పంచ్‌గా 79 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పది వార్డులకు జరిగిన ఎన్నికల్లో నాలుగు బీజేపీ, నాలుగు బీఆర్ఎస్, రెండు కాంగ్రెస్ తరపున వార్డు సభ్యులు గెలుపొందారు. ఉప సర్పంచ్‌గా లక్షెట్టి గంగన్నను ఎన్నుకున్నారు.