జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ

KKD: రాబోయే కొన్ని గంటల్లో కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీంతో కాకినాడ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.