మంత్రిని కలిసిన పుట్టపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్
సత్యసాయి: మంత్రి అచ్చెన్నాయుడును పుట్టపర్తి మార్కెట్ కమిటీ ఛైర్మన్ పూల శివప్రసాద్ విజయవాడలో కలిశారు. పుట్టపర్తి యార్డుతో సహా జిల్లాలోని మార్కెట్ యార్డుల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మంత్రికి అందజేశారు. దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు, మార్కెట్ అభివృద్ధికి అవసరమైన అనుమతులు, నిధుల విడుదలను త్వరగా చేపడతామని హామీ ఇచ్చారు.