రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

NTR: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. భవానిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 40 నుంచి 50 మధ్య ఉంటుందని చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.