'శ్రీశైలంలో 2.50 లక్షల మంది భక్తులు'
NDL: శ్రీశైల క్షేత్రంలో ఒక్కరోజు నిద్రిస్తే అనేక యుగాల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసంతో దాదాపు 2.50 లక్షల మంది భక్తులు ప్రస్తుతం క్షేత్రంలో ఉన్నారని కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఎస్పీ సునీల్, జేసీ కార్తీక్‌తో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. పాగాలంకరణ కార్యక్రమానికి దాదాపు 7 వేల మంది భక్తులను అనుమతించేలా చర్యలు తీసుకున్నారు.