నానో యూరియా వినియోగంపై అవగాహన

నానో యూరియా వినియోగంపై అవగాహన

AKP: మునగపాకలో శనివారం నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏడీఏ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఎకరం విస్తీర్ణానికి 500 ఎంఎల్ నానో యూరియా సరిపోతుందన్నారు. అన్ని రకాల పంటలకు దీనిని వినియోగించుకోవచ్చునని అన్నారు. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకుని వచ్చిన ఫలితాన్ని బట్టి ఎరువులు వాడాలన్నారు.