రేపు ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష
MBNR: గండీడ్ మండలం వెన్నచేడ్ ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా తెలిపారు. 6వ తరగతికి ఉదయం 10 నుంచి 12 వరకు, 7 నుంచి 10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, హాల్ టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.